AP Government Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలలో 244 ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Andhra Pradesh Government Medical College job recruitment apply online now

AP Government Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలలో 244 ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Andhra Pradesh Government Medical College job recruitment apply online now

Andhra Pradesh Government Medical College job Notification : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సువర్ణావకాశం. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో 244 ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా కేవలం 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ & డిప్లమా చేసిన అభ్యర్థులు అందరు కూడా అవకాశం కల్పిస్తూ వెంటనే అప్లై చేసుకున్నారంటే ఒక వారం ఉద్యోగం పొందుతారు.

AP ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా 29 విభిన్న విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిలో రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, అనస్తీషియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, రిఫ్రాక్షనిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి.

AP ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల విద్యార్హతలు:

10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు, సంబంధిత పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

AP ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల ఖాళీలు:

మొత్తం 244 పోస్టులు భర్తీ చేయబడతాయి. వాటిలో 107 కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు, 137 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు సంబంధిత జోన్‌లోని RDM&HS కార్యాలయంలో జనవరి 15, 2025 లోపు దరఖాస్తు సమర్పించాలి. ప్రతి జోన్‌లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల ముఖ్య తేదీలు:
• నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 1, 2025
• దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 1, 2025
• దరఖాస్తు చివరి తేదీ: జనవరి 15, 2025
• ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల: జనవరి 24, 2025
• ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల: జనవరి 29, 2025

AP ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసిన వారికి 2 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పని చేసిన వారికి 1 మార్కు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు:
నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫీజు వివరాలు పొందుపరచలేదు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మంచి అవకాశం లభించింది. అర్హులైన అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసి, ఈ అవకాశాన్ని పొందగలరు.

మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

Leave a Comment